JGL: జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీలీజుల రెన్యూవల్, నూతన క్వారీల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యాయనం సంస్థ జారీ చేసిన పర్యావరణ అనుమతి తప్పనిసరని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్ సైట్ https://jagtial.telangana.gov.i పొందుపరిచినట్లు పేర్కొన్నారు.