SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్ట్‌కు 915 క్యూసెక్కులు వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి గురువారం తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1493 అడుగులు కాగా, 1493.33 ఫీట్ల వద్ద వరద చేరిందన్నారు. కుడి, ఎడమ పంట కాలువలకు 95 క్యూసెక్కులు, అలుగు ద్వారా 820 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందని వివరించారు.