ప్రకాశం: మార్కాపురం చెరువుకు నీటిని సప్లై చేసే కీలకమైన కాలువ పుడికితీత పనులను గురువారం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఆ తరువాత మాల్యవంతునిపాడు గ్రామం వద్ద గుండ్లకమ్మ నది నుండి సప్లై ఛానల్ కాలువ వేరు అయ్యే ప్రదేశంలో నీటి ఫ్లోను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువును నీటితో నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు.