MDK: పశువులకు ముందస్తు టీకాలు వేయించడం ద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తోందని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య అన్నారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం, అక్కన్నపేటలో గురువారం ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి ధర్మారంలో జిల్లా పశు వైద్య అధికారి గారు ఆకస్మిక పర్యవేక్షణ చేసి, టీకా రిజిస్టర్ లను పరిశీలించారు.