NZB: అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు చెరువులు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. గురువారం వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్, పోచంపల్లి గ్రామాల మధ్య రోడ్డు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోచంపల్లివారు అంక్సాపూర్, వేల్పూర్ రావాలంటే పడగల్ నుంచి తిరిగి రావాలని అధికారులు పేర్కొన్నారు.