NGKL: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో బాధితునికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతూ ఇవాల కల్వకుర్తి (M) తర్నికల్ గ్రామానికి చెందిన గారెల తిరుపతయ్య స్థానిక ఎంఆర్వో ఇబ్రహీంకు వినతి పత్రం అందజేశారు. ఇల్లు కూలిపోవడం వల్ల సర్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ గౌడ్ పాల్గొన్నారు.