NRML: సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో DRDA-IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2389గా నిర్ణయించిందని తెలిపారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్ల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులున్నారు.