WGL: మొంథా తుఫాను కారణంగా వరంగల్ జిల్లాలోని నవడ్డేపల్లి, శ్యామల గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో ఇవాళ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వరద నీటి ప్రవాహ పరిస్థితులు తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి తరలింపు, భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.