KMR: సైదాపూర్.(M)గుజ్జులపల్లికి చెందిన పూదరి రమేష్ రేకుల ఇల్లు నిన్న కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. అదృష్టవశాత్తు ఇల్లు కూలిన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంపాలకరుణాకర్ సమస్యను మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యమన్నారు.