KRNL: డోన్ ప్రభుత్వ ITI కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా జరగనుంది. 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని టెన్త్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై పూర్తి చేసి 18 నుంచి 30 ఏళ్ల వయసు గల వారు అర్హులని పేర్కొన్నారు. 795 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.