TPT: తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 55 చెరువులు దెబ్బతిన్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వీటి మరమ్మతుకు రూ.75 లక్షలు ఖర్చు అవుతుందని, ఇందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. పది గృహాలు దెబ్బతినగా ఒక్కో గృహానికి రూ. 50 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. 25 ప్రాంతాల్లో కల్వర్టర్లు, రోడ్లు దెబ్బతిన్నాయన్నారు.