MNCL: జన్నారం మండలంలోని జన్నారం, ఇందన్పల్లి అటవీ రేంజ్ పరిధిలో ఉన్న వివిధ ప్రకృతి రమణీయ ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆయా రేంజ్ పరిధిలో బైసన్ కుంట, గనిశెట్టి కుంట, పర్యాటక ప్రాంతాలలోని కుంటలు వరద నీటితో నిండిపోయాయి. ఆ కుంటలలోనే ఎండిపోయిన ఎత్తైన చెట్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆ చెట్లపైనే పలు రకాల పక్షులు గూళ్లను నిర్మించుకున్నాయి.