VZM: బాడంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై తారకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి (M) తింటువలస సమీపంలోని చెరువు వద్ద ఈనెల 25న గుర్తు తెలియని యువకుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. గమనించిన గ్రామస్థులు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.