W.G: మొంథా తుఫాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఇళ్ల పైకప్పులు దెబ్బతినడం వంటి నష్టాలు సంభవించాయి. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం నరసాపురం మునిసిపల్ పరిధిలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. ప్రభావిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయం తక్షణమే అందే విధంగా మునిసిపల్ అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు