KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారురెడ్డి బుధవారం టీడీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకులు ప్రొద్దుటూరు నుంచి 352 మందిని క్యాసినోలో జూదం ఆడించడానికి గోవాకు తీసుకెళ్లి, అక్కడ రూ. 10 కోట్లు మోసగించి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. బాధితులే తనకు ఈ విషయం చెప్పారని బంగారురెడ్డి తెలిపారు.