GDWL: గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్లో కనీసం తాగదానికి కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువరం ఉదయం గ్రామ పంచాయతీ కార్యకర్తలు తెచ్చిన నీటి కోసం గ్రామంలో చీకటి నుంచే ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వాలు కనీస అవసరాలు కుడా తీర్చకుంటే ఇంక ఎందుకు అని స్థానికులు పేర్కొన్నారు.