ATP: గుత్తి చెర్లోపల్లి కాలనీలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు హోటల్ చంద్ర అనే వ్యక్తికి చెందిన పాత ఇంటిపై కప్పు బుధవారం కూలిపోయింది. పైకప్పు కూలిన సమయంలో ఇంట్లో ఉన్న వారు అప్రమత్తమై వెంటనే బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలని బాధితుడు చంద్ర ప్రభుత్వాన్ని కోరారు.