TG: హనుమకొండలో ఊరచెరువుకు గండి పడింది. దీంతో 100 ఫీట్ రోడ్లో ఊరచెరువుకు ఒక్కసారిగా వరద వస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల డాబాలపైకి చేరుకున్నారు. 100 ఫీట్ రోడ్, వివేక్ నగర్, ప్రగతి నగర్, సమ్మయ్యనగర్, టీఎన్జీవో కాలనీ నీట మునిగాయి. జేసీబీల సాయంతో ముంపు కాలనీ వాసులను అధికారులు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.