HYD: భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనానికి నేటి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు MGBS నుంచి డీలక్స్ (నాన్ ఏసీ) బస్సులు నడపనున్నట్లు డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఒక్కొకరికి ఛార్జీ రూ.510గా నిర్ణయించారు. భక్తులు ముందుగానే ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలన్నారు.