పాక్ చేతిలో ఓడిపోవడంపై బంగ్లా కెప్టెన్ జేకర్ అలీ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే వరుసగా 2 మ్యాచులు ఓడిపోయామని పేర్కొన్నాడు. బౌలింగ్ పరంగా రాణించామని, కానీ బ్యాటింగ్‌లో సైఫ్ హసన్‌కు కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయామని అన్నాడు. ఇక లిటన్ దాస్ గాయం కారణంగా ఆటకు దూరం కావడంతో జేకర్ జట్టు పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే.