సత్యసాయి: జిల్లాలో దీపం-2 పథకం రాయితీ జమ కాని లబ్ధిదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులు సమన్వయం చేసుకుని లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతివారం పర్యవేక్షణ చేయాలని సీఎస్డీటీలకు ఆదేశాలు జారీ చేశారు.