HYD: ఆర్టీసీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. నగరంలో మొదటగా విద్యార్థుల బస్సు పాస్‌లను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చి, పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని భావిస్తోంది. అనంతరం మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులతో సహా అందరికీ వీటిని జారీ చేయనున్నారు. ఈ విధానం అమలుపై అధికారులు సవాళ్లు, లాభాలను అంచనా వేస్తున్నారు.