NRML: బాసరలోని శారద నగర్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన వాహన పత్రాలు లేని 37 బైకులు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు భద్రత అలాగే గంజాయి, మత్తు పానీయాల వలన జరిగే అనర్థాల గురించి స్థానిక ప్రజలకు ముథోల్ సీఐ మల్లేష్ వివరించారు.