మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి పంజాబ్ హర్యానా ట్రాన్స్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.