శ్రీకాకుళం: దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం శ్రీకాకుశం జిల్లా వ్యాప్తంగా 10, 981 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 10,728 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 113 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అత్యధికంగా రణస్థలంలో 595, తక్కువగా ఎల్ఎన్ పేటలో 131 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.