TG: బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బాలనగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరగడంతో 8 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు, వ్యాపార నిమిత్తం వచ్చే ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.