ATP: మాజీ మంత్రి, సింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తాడేపల్లిలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అనారోగ్యం నుంచి ఇటీవలే కోలుకున్న శైలజానాథ్ ఆరోగ్యంపై జగన్ ఆరా తీశారు. అనంతరం జిల్లా రాజకీయాలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఇరువురు చర్చించారు.