NTR: APSSDC ఆధ్వర్యంలో శనివారం విజయవాడ విద్యాధరపురం న్యాక్ ట్రైనింగ్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 11 కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో 18-35 ఏళ్ల మధ్య వయస్సున్న SSC, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థులు naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.