JN: పాలకుర్తి మండల కేంద్రంలోని గుడివాడ శ్రీ విగ్నేశ్వర కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా 50 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకారమైన అమ్మవారు భక్తులను ఆకట్టుకుంటుంది. భక్తులు అధికంగా హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు.