SRD: ఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాలు ఉన్నాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డిలో అత్యధికంగా 101, మెదక్ -47, సిద్దిపేట- 93 ఉన్నట్లు చెప్పారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు. 23వ తేదీన డ్రా జరుగుతుందని వివరించారు.