TPT: ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు చంద్రగిరి(M) ముంగలిపట్టుకు చెందిన రాజేంద్రప్రసాద్ ఓ కళాశాలలోని 2వ అంతస్తులో పైపు లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.