ప్రకాశం: గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాల వద్ద RTC బస్సులు ఆగకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు పోరుమామిళ్ల, కలసపాడు, కాశిరెడ్డినాయన మండల ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు ఆసుపత్రిలో చూయించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో RTC బస్సులు నిలబెట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా ఉన్నా నిలబెట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.