BHPL: గోరకొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గా దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారమైన ఐదో రోజు నవదుర్గదేవి శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాల స్వీకరించారు.