గుంటూరు ఎన్టీఆర్ ఐలాండ్ సెంటర్లో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ రజాకారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో తొలి భూ పోరాట యోధురాలుగా, పేదల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయురాలన్నారు.