SRCL: వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కనికరపు రాకేష్ పాల్గొన్నారు.