WNP: రేపటి నుంచి జిల్లాలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు కాకుండా, వర్షం కారణంగా ఒక రోజు ముందుగానే దసరా సెలవులు ప్రకటించారన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు ఉంటాయని అన్నారు. అన్ని కాలేజీలు తప్పకుండా సెలవుల షెడ్యూల్ పాటించాలని, క్లాసులు నిర్వహిస్తే కాలేజీలపై చర్యలు తప్పవని ఆయన తెలిపారు.