మహారాష్ట్ర ధారాశివ్ జిల్లాలోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన DY CM అజిత్ పవార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అన్నదాతలను పరామర్శిస్తున్న సమయంలో ‘వరద బాధిత రైతులకు రుణమాఫీ చేస్తారా?’ అని ఓ రైతు ఆయనను కోరాడు. నిన్ను సీఎం చేయమంటావా? రుణమాఫీ చేయాలా? వద్దా? అనే విషయం మాకు తెలియదా? మేము ఆటలాడటానికి ఉన్నామా?’ అంటూ ఆ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.