కడప: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పెద్దముడియం మండల పరిధిలోని పెద్దపసుపుల గ్రామానికి చెందిన వంగల విక్రాంత్ర్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా గురువారం ఇతన్ని పట్టుకున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. అతని వద్ద నుంచి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.