NLG: 2025-26 సంవత్సరమునకు విదేశాలలో విద్యనభ్యసించుటకు జిల్లాలోని యస్.సీ అభ్యర్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు శశికళ కోరారు. వచ్చేనెల 19 వరకు అవకాశం ఉందని https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని కోరారు.