BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం మండల ఎస్సై సాకాపురం దివ్య గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్సైకి అమ్మవారి చీర, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘుసాల తిరుపతి, కరెట్లపల్లి రాజేందర్, నిమ్మల రాజు ఉన్నారు.