HNK: శాయంపేట మండల కేంద్రంలో BJP మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. రామకృష్ణ మాట్లాడుతూ, జనసంఘ స్థాపకుల్లో ఒకరైన దీన్ దయాల్ ఏకత్వం, అంత్యోదయ సిద్ధాంతాలతో సమాజానికి స్ఫూర్తినిచ్చారని ఆయన అన్నారు.