ముఖంపై పిగ్మంటేషన్, ముడతలతో ఇబ్బంది పడేవారు రాత్రి పడుకునే ముందు బాదం ఆయిల్‌తో ముఖానికి మసాజ్ చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారడంతో పాటు చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. బాదం నూనెలోని జింక్ మొటిమలను తగ్గిస్తుంది. దీనిని ఫేస్‌ప్యాక్, మాస్క్‌లో కూడా కలిపి వాడొచ్చు. అయితే అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటించకపోవడమే మంచిది.