AP: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాల్సిందేనని స్థానికులు తేల్చి చెప్పారు. దీనిపై వారితో మాట్లాడి అభిప్రాయం తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రయత్నించారు. అయితే దీనిపై చెప్పేదేం లేదని, తమకు వద్దంటే వద్దని వారు తేగేసి చెప్పారు. ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.