TG: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు MLC అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. BRS చేసిన అవినీతిని ప్రజలు మర్చిపోరని తెలిపారు. తమ మంత్రుల గురించి మాట్లాడే హక్కు BRS నేతలకు లేదని విమర్శించారు. రూ.లక్షల కోట్ల తెలంగాణ ధనాన్ని ముంచారని మండిపడ్డారు. హరీష్ శాఖలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు అని అన్నారు. BRS ఆరోపణలను జనం పట్టించుకోరని పేర్కొన్నారు.