GNTR: రాజమండ్రిలో గత రెండు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17, అండర్-19 ఉషూ క్రీడల్లో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించి సత్తా చాటారు. అండర్-17లో, పావని స్వర్ణం, లక్ష్మీ ప్రసన్న రజతం, అంజుం కాంస్యం గెలిచారు. ఇక అండర్-19లో, యోగేష్ విశ్వనాథ్ స్వర్ణం, వెంకట్ రజతం కైవసం చేసుకున్నారు. కాగా, ఇవాళ వారిని పలువురు అభినందించారు.