GNTR: గుంటూరు పట్టాభిపురం పరిధిలో మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై, ప్రేమగా మారిన ఈ వ్యవహారంలో, ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు సన్నిహితంగా ఉండటం వలన బాలిక గర్భం దాల్చింది. దీంతో, బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.