ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పక్కటెముకల్లో రక్తస్రావం కావడంతో ఐసీయూలో చేరిన అతడికి శస్త్రచికిత్స అవసరం లేదని బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపాడు. ప్రస్తుతం అయ్యర్ త్వరగా కోలుకుంటున్నాడని.. ఐసీయూ నుంచి బయటకు వచ్చాడని పేర్కొన్నాడు.