రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నీతీశ్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతారని, కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు. మోదీ బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భరతరత్న ఇచ్చి.. రాష్ట్ర ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. అలాగే పహల్గాం దాడి జరిగిన వెంటనే మోదీ ఆపరేషన్ సింధూర్‌కు ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు.