BPT: పర్చూరు వద్ద వాగులో ఉద్ధృత ప్రవాహం కారణంగా సమీపంలోని ఓ ప్రార్థన మందిరంలో బుధవారం 20 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, స్థానికుల సహకారంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అందరూ క్షేమంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.