కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 31వ తేదీన 31వ ఎన్టీఆర్ మెమోరియల్ కప్ ఎన్టీఆర్ జిల్లా ఓపెన్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో జిల్లా స్థాయి క్రికెట్ జట్లు పాల్గొంటాయని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. జట్ల ఎంపిక,మ్యాచ్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.